Tuesday, 3 November 2026

పారిశుద్ధ్య కార్మికులకు బట్టల పంపిణీ చేసిన మదన్మోహన్రావు

పారిశుద్ధ్య కార్మికులకు బట్టల పంపిణీ చేసిన మదన్మోహన్రావుజనం సాక్షి,చెన్నారావుపేట
మండలంలోని పాపయ్యపెట  గ్రామానికి చెందిన గ్రామ పంచాయితీ  పారిశుద్ధ్య కార్మికులకు బుధవారం గ్రామ పంచాయతీ ఆవరణలో సమాజసేవ లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ రాష్ట్ర నాయకులు ఈజెఎంర్ ఫౌండేషన్ చైర్మెన్ ఎర్రబెల్లి మదన్ మోహన్ రావు కార్మికుల శ్రమను గుర్తించి వారికి ఉగాది నూతన సంవత్సర సందర్బంగా బట్టలు పంపిణీ చేయడం జరిగింది.ప్యాకెట్లను ‌స్తానిక మండల బీజేపీ నాయకులు నూకల కృష్ణ అందజేశారు.ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ తమను గుర్తించి బట్టలు పంపించిన మదన్ మోహన్ రావు కి కృతజ్ఞతలు తెలిపారు.వారికి ఈ ఉగాది నూతన సంవత్సరం లో ప్రజా సేవ మరింత చెసే అవకాశం భగవంతుడు కల్పీంచాలని వారు అభిలషించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉప్పరి లక్ష్మి, ఉప సర్పంచ్ మెడి వెంకన్న, కోప్షన్ సభ్యులు దేవ్సింగ్, ఎస్ఎంసి చెర్మెన్ జటోత్ యాకూబ్, అర్ ఎం పి కత్తి స్వామి, లింగాల సారంగం, దుడయ్య తదితరులు పాల్గొన్నారు.