పారిశుద్ధ్య సేవకుల నడుమ ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు

..పారిశుద్ధ్య సేవకుల నడుమ ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు..
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ చైర్మన్స్ ఛాంబర్ వైస్ చైర్ పర్సన్ మరియు వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వికారాబాద్ పట్టణంలోని బిజేఆర్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వికారాబాద్ పట్టణాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న వికారాబాద్ మున్సిపల్ పారిశుద్ధ్య సేవకుల నడుమ కేక్ కట్ చేసిన చైర్ పర్సన్ గారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కేసీఆర్ గారు, భారతదేశానికి తెలంగాణ మోడల్ ను అందించి, దేశాన్ని మరింత అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశానికి ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్ గారు, మాజీ జడ్పిటిసి ముక్తాహార్ షరీఫ్ గారు, 5 జోన్ల జవాన్లు, పారిశుద్ధ్య సేవకులు తదితరులు పాల్గొన్నారు.