పార్టీలోనే కొనసాగుతా: పెద్దిరెడ్డి

హైదరాబాద్‌: తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటికీ పార్టీలోనే కొనసాగుతానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలియజేశారు. తన నియోజవర్గంలోని ప్రతి పనికి సీఎం అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయాలన్నీ అధిష్ఠానానికి వివరించానన్నారు. అసమర్థ ముఖ్యమంత్రిని తొలగించాలన్నదే తన డిమాండ్‌ అని పెద్దిరెడ్డి తెలియజేశారు.