పార్టీల అధినేత ఆశీర్వాదం కోసం నాయకుల భజన

పార్టీల అధినేత ఆశీర్వాదం కోసం నాయకుల భజన

— ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయం వేడెక్కుతోంది.?

— గెలుపే లక్ష్యంగా ప్రచారం నిమిత్తం తమ కను సనల్లో ఉండే సంస్థల విలేకరులకు మాత్రమే ఇండ్ల స్థలాలు, ముడుపులు, తయులాలు

— టికెట్ దక్క దనుకునేవారు పక్క పార్టీల వైపు చూపులు ?

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, బరిలో నిల్చునేందుకు టికెట్ ఆశించేవారు, ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు, అధికారం కావాలను కునేవారు, అన్ని పార్టీల నేతలు వారి యొక్క నాయకుడి భజనను మొదలుపెట్టి పార్టీ అధినేత అనుగ్రహం కొరకు పూజారి పాత్ర పోషిస్తూ రానున్న ఎన్నికలకు ప్రజలలో నేనున్న అనే ప్రచారాన్ని ప్రారంభిస్తూ, పార్టీ కార్యకర్తల ఇంట్లో శుభకార్యాలకు పిలవక పోయినా తమ భజన బృందాన్ని వెంటేసుకొని హాజరై ఫోటోలకు ఫోజులిస్తూ పార్టీ ముఖ్య వ్యక్తి నుండి అమలు పరుస్తున్న పథకాల పేర్లతో మీకు మేము అది చేసాం, ఇది చేసాం అంటూ తెలియ పరచు కుంటూ (నా హయాంలో) నేను ఈ పనులు చేశానంటూ తెలియ పరచకుండా, మిగిలి ఉన్న సమస్యలను తెలియ పరచడానికి ఎవరైనా ముందుకు వస్తే ఆ నాయకుడు మాట్లాడుతున్న సమయంలో భజన బృందం సమస్య తెలియ పరచడానికి వచ్చే వ్యక్తిని నిలిపివేస్తూ, నాయకుడికి మేం నీ పరమ భక్తుల మంటూ జరగని పనులను జరుగు తున్నట్లుగా అన్ని జిల్లాల్లో కెల్లా మన జిల్లాలో తమరు మాత్రమే అభివృద్ధిలో నెంబర్ వన్ స్థాయిలో ఉన్నారంటూ సమస్యలను తెలియ పరచకుండా, ఆ నాయకుడి చుట్టూ ఉన్న భజన బృందం భజన చేస్తుంటే, భజన మత్తులో నాకింకా తిరిగేది అనుకుంటూ ఇష్టరాజ్యముగా 5 సంవత్సరాల కాలం వరకు నేను చెప్పేదే వేదం అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఎలక్షన్స్ కాలం సమీపిస్తున్న తరుణంలో పార్టీలలో ఊహాగానాలకు తెర లేపుతూ, స్థానికులుగా గెలుపొందిన మాకు టికెట్ ఇవ్వకపోతే పక్క పార్టీలో మాకు ప్రాధాన్యత ఉంటుందని పనిచేస్తున్న పార్టీ అధినేతకు చురుక తగిలేలా భజన బృందం ద్వారా సోషల్ మీడియాలలో, లేదా సొంత మీడియాలో ప్రచారం నిర్వహిస్తూ , అధికారంలో రావడం కొరకు పాదయాత్రల ద్వారా ప్రజల్లో (గుర్తులు) గుర్తుండేలా ప్రచారం నిర్వహిస్తూ అధికారంలో ఉన్న పార్టీలను కడగడానికి మాత్రమే పాదయాత్రలను వాడుకుంటూ మేము అధికారంలోకి వస్తే నీ సమస్యలకు పరిష్కారం చేస్తామంటూ తెలుపుతూ, పార్టీలకి సంబంధించిన నాయకులు అధికారంలోకి రావడానికి ఎంతకైనా తెగిస్తూ, గెలిచిన తర్వాత గెలిచిన వ్యక్తి వద్దకు వెళ్లి సమస్యను తెలుపుకుందాం అనుకుంటే ఆ నాయకుడు ఆ సమయంలో ఉన్న మూడును బట్టి సమస్య పరిష్కారం సంగతి దేవుడిని ఎరుగు, తిట్లు పడకుండా ఉంటే చాలు అనుకుంటూ గత్యంతరం లేని పరిస్థితులలో 5 సంవత్సరాలు మా ఖర్మ అంటూ కాలాన్ని నెట్టుకుంటూ వస్తున్నారు ప్రజలు ? గెలిచిన వ్యక్తి భజన బృందం నకు, మరల అవకాశం కొరకు తెలిపే మాటలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటూ జనాల సమస్యలు పట్టించు కోకుండా, వార్డులలో , గ్రామాలలో, మండలాలలో పట్టణాలలో జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలకు పరిష్కారం చేస్తామంటూ తెలుపుతూ, సమస్యలను ఒక్కసారి పరిష్కారం చేస్తే గెలుపొందిన నేత సమస్యల పరిష్కారం కొరకు నా చుట్టూ తిరిగేది ఎవరని, మరల పోటీ చేయడం కొరకు అధినేత అడిగినంత డబ్బును పడవేసి టికెట్ పొందుతా అనుకుంటూ, ఎలక్షన్స్ సమీపిస్తున్న తరుణంలో మాత్రమే సమస్యలను పరిష్కారం చేస్తే, ఇచ్చే నోట్లతో ఓట్లు నా ఖాతాలోకి వచ్చి విజయం సాధిస్తాం అనేటటువంటి భావన లోనే ఉండిపోవడం, ప్రచారం నిమిత్తం పేరున్న సంస్థలలో పనిచేస్తున్న కొందరు స్వామి భక్తిని తెలియపరిచే విలేకరులతో, జరగని అభివృద్ధిని జరిగినట్లుగా, రేసులో ఆ పోటీ చేసే నాయకుడు గెలుపు గుర్రంగా ప్రజలకు ప్రచారం నిమిత్తం నాయకుల ఆశీర్వాదం కింద బహుమతులుగా ఇండ్ల స్థలాలు, స్పెషల్ ప్యాకేజీలు అందిస్తూ మరో మారు గెలిచే ప్రయత్నం ? స్థానిక నియోజక వర్గ ప్రజలు ఓటు సమయాన ఆ నాయకుడికి బుద్ధి చెప్తా మంటూ నోటు తీసుకొని ఓటు వేస్తూ తమ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుకుంటూ దేశాన్ని నాశనం చేసు కోవడం లో ముఖ్యపాత్ర వహిస్తున్నారు.ఇకనైనను నాయ కులలో భజన దారులలో మార్పు వస్తుందని ఆశిస్తూ నిజాయితీ గల వ్యక్తులకు అవకాశం కల్పించి మన బ్రతుకులను మార్చుకుందాం.? అనుకుంటున్న ప్రజలు