పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి.
– తెలంగాణ మాల మహానాడు డిమాండ్.
బెల్లంపల్లి, డిసెంబర్ 2, (జనంసాక్షి )
నూతన పార్లమెంటు భవనానికి
అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ మాల మహానాడు నాయకులు డిమాండ్ చేస్తూ శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని ఆర్డివో కార్యాలయంlo వినతి పత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసర్ల యాదగిరి మాట్లాడుతూ ఈనెల 6న అంబేద్కర్ 67వ వర్ధంతిని బెల్లంపల్లి పట్టణంలో అధికారికంగా ఘనంగా నిర్వహించాలని, నూతన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు నామకరణం చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ నియోజకవర్గమైన బెల్లంపల్లి పట్టణంలో అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలతో అలంకరించాలని, సౌండ్ సిస్టం ద్వారా మైకులు ఏర్పాటు చేయాలని, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 జయంతి, డిసెంబర్ 6 వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించాలన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని అన్ని విగ్రహాలకు గ్రామ కార్యదర్శుల ద్వారా సంబంధిత అధికారుల ద్వారా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జిల్లా అధ్యక్షురాలు దాసరి జయ, నియోజకవర్గ అధ్యక్షుడు ఎలకల శ్రీనివాస్, నియోజకవర్గ అధ్యక్షురాలు లింగాల అమృత, పట్టణ గౌరవ అధ్యక్షుడు చీటి పోషం, పట్టణ కార్యదర్శి, గౌరవ అధ్యక్షుడు పడకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి.




