Monday, 2 November 2026

పార్లమెంట్‌కు ముందస్తు ఎన్నికలు ఉండవు

కేంద్ర మంత్రి మనీష్‌తివారి
హైదరాబాద్‌: పార్లమెంట్‌కు ముందస్తు ఎన్నికలు ఉండవని కేంద్ర మంత్రి మనీష్‌తివారి స్పష్టం చేశారు. తెలంగాణ కోసం యువకులు ఆత్మబలిదానాలు చేసుకోవద్దని ఆయన హైదరాబాద్‌లో కోరారు. తెలంగాణ అంశం సున్నితమైందని, సమస్య పరిష్కారమయ్యే వరకు ఓపిక పట్టాలని సూచించారు. దేశ భద్రత వ్యవహారంలో యూపీఏ కఠినంగా వ్యవహరిస్తోందని చెప్పారు.  ఈవిషయంలో  భాజపాతోపాటు విపక్షాలు చేస్తున్న ఆరోపణలు సరికావని విమర్శించారు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ నేతృత్వంలో భారత్‌, పార్టీ ముందుకు వెళ్తాయని ఆయన చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *