పాలకులు మారిన… ప్రజల జీవన ప్రమాణాలు మారడం లేదు

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు..
మిర్యాలగూడ. జనం సాక్షి
ఎంతమంది పాలకులు మారిన.. ప్రజల జీవన ప్రమాణాలు మారడం లేదని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ నాలుగో తేదీ నుండి ఏడు వరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరిగే సిపిఐ. తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభ కరపత్రాలను సోమవారం పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. మహాసభకు 33 జిల్లాల నుంచి ఎంపికైన ఎనిమిది వందల మంది ప్రతినిధులు హాజరవుతారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. సాధించిన ప్రగతి. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు. వాటి అమలు. ప్రజల జీవన పరిస్థితులను సమీక్షించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ వల్ల చిన్న. సన్న కారు రైతులు. చిరు వ్యాపారులు. శ్రమజీవులు. పేద కామ మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయని వాపోయారు. ప్రధానమంత్రి మో ది
అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల. పేదలు మరింత పేదలుగా. ధనికులు అత్యంత సంపన్నవంతులుగా ఎదుగుతున్నారన్నారు. వంటగ్యాస్
పెట్రోల్. డిజిల్. విద్యుత్. నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందే అని విమర్శించారు. దేశంలో మతోన్మాద దాడులు పెరిగిపోతున్నాయని అన్నారు. నీళ్లు. నిధులు. నియామకాల. నినాదంతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన జరగడం లేదన్నారు సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా దాపురించాయని చెప్పారు ప్రజా సమస్యలే ఎజెండాగా ఎంచుకొని వాటి పరిష్కారం కోసం ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఎండి సయ్యద్. మండల సహాయ కార్యదర్శి గోగుల యాదగిరి. బంటు రాజేశ్వరి. ఎస్కే షమీం. మామిడి మార్తమ్మ పాల్గొన్నారు