Sunday, 8 November 2026

పాలమూరులో షర్మిలకు తెలంగాణ సెగ

మహబూబ్‌నగర్‌ : అన్న వదిలిన బాణాన్ని అంటూ తెలంగాణపై దండయాత్రకు వచ్చిన చెల్లెలు షర్మిలకు తెలంగాణ సెగ తగిలింది, శాంతినగర్‌లో షర్మిల పాదయాత్రను తెలంగాణ వాదులను అడ్డుకున్నారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పాలని, జైతెలంగాణ అనాల్సిందేనని వారు డిమాండ్‌ వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ పార్టీ దండు తెలంగాణ వాదులపై విరుచుకుపడి విపరీతంగా చితకబాదారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి తెలంగాణ వాదులపైనే లాఠీ ఛార్జీచేశారు. పలువరు తెలంగాణ వాదులను పోలీసులు అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *