బీబీకా అలవాను సందర్శించిన కమిషనర్ అనురాగ్ శర్మ
మాదన్నపేట మొహరం సంతాప దినాల సందర్బంగా శనివారం పాత నగరంలోని బీబీకా అలవాను నగర పోలీస్ కమిఫనర్ అనురాగశర్మ సందర్శించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ పదో మొహరం వూరేగింపు బందోబస్తుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పాత నగరంలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని పోలీసు బందోబస్తు నిఘూ ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు.



