Thursday, 5 November 2026

పాలెం వెంకన్న ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు.

బిజినపల్లి,సెప్టెంబర్17(జనంసాక్షి):
భాద్రపద మాసం సప్తమి శనివారం రోజు కావడంతో బిజీనపల్లి మండల పరిధిలోని పాలెం గ్రామంలో గల శ్రీ అలివేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారనీ ఆలయ ప్రధాన అర్చకులు కురవి రామానుజా చార్యులు తెలిపారు. అనంతరం భక్తులు స్వామివారికి ముడుపులు సమర్పించారు.భక్తులు ఆలయ ఆవరణలో సామూహిక సత్య నారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. వేద బ్రాహ్మణులు భక్తులకు వేద ఆశీర్వ చనాలు అందజేసి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ అర్చకులు శుక్ల, జయంత్, చక్రపాణి ఆలయ సిబ్బంది శివకుమార్, బాబు భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Attachments area