మార్కెట్ కమిటీ లో ఘనంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు.
-జాతీయ జెండాను ఆవిష్కరించిన మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్.
తాండూరు సెప్టెంబర్ 17 (జనం సాక్షి) వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో.సెప్టెంబర్ 17 పురస్కరించుకొని జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను మార్కెట్ కమిటీ లో ఘనంగా నిర్వహించారు. శనివారం తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ విట్టల్ నాయక్ మాట్లాడుతూ నిజం పరిపాలన నుండి తెలంగాణ కు విముక్తి చెందిన సందర్భంగా సెప్టెంబర్ 17న విమోచ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహకారంతో తాండూరు అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మన రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం అన్ని వర్గాల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు రైతుబంధు రైతు రుణమాఫీ ఆసరా పెన్షన్లు దళిత బంధు పలు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలొ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, డైరెక్టర్లు ఆశన్న భీమ్ రెడ్డి మల్లప్ప ఇర్ఫాన్, వీరేందర్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లొల నర్సింలు, ఆలయ చైర్మన్లు సంజీవరావు, రాజన్ గౌడ్, కౌన్సిలర్ లు ఆసిఫ్, భీమ్ సింగ్ రాథోడ్, ది మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు రామ్ రెడ్డి, ఉర్దూగర్ చైర్మన్ అబ్దుల్ రజాక్, నాయకులు సంతోష్ గౌడ్, చంటి యాదవ్, హమాలి గుమస్తా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area