Friday, 6 November 2026

పాలేరు శాసనసభ్యులు శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి కృషితో నియోజకవర్గానికి నర్సింగ్ కళాశాల మంజూరు.

పాలేరు శాసనసభ్యులు శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి కృషితో నియోజకవర్గానికి నర్సింగ్ కళాశాల మంజూరు.
ఖమ్మం తిరుమలాయ పాలెం (నవంబర్ 23) జనం సాక్షి. పాలేరు శాసనసభ్యులు శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి పాలేరు నియోజకవర్గంలో నర్సింగ్ మరియు మెడికల్ కళాశాల కొరకు రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో నివేదిక అందించిన నేపథ్యంలో పాలేరు నియోజకవర్గానికి నర్సింగ్ కళాశాలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జిఓ నెంబర్.141 ద్వారా నాలుగు సంవత్సరాల బీఎస్సీ నర్సింగ్ కోర్సును కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్,వరంగల్,అఫిలియేషన్ తో,60 సీట్లతో నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.పాలేరు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న పాలేరు నియోజకవర్గ విద్యార్థులకు అన్ని సదుపాయాలతో ఉన్నత విద్యా అందించాలనే లక్ష్యంతో విద్య వ్యవస్థ పై పూర్తి అవగాహన మరియు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, పాలేరు నియోజకవర్గానికి గతంలో ఎన్నడు లేని విధంగా ఒకే విద్యా సంవత్సరంలో రెండు కళాశాలలు (ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాల మరియు బీఎస్సీ నర్సింగ్ కళాశాల) మంజూరు చేయించారు.
పాలేరు నియోజకవర్గానికి నర్సింగ్ కళాశాలను మంజూరు చేయటం పట్ల పాలేరు శాసనసభ్యులు శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి *కేసీఆర్ కు రాష్ట్ర హెల్త్ మినిస్టర్ *తన్నీరు హరీష్ రావు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.