పిఓడబ్ల్యూ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి) : స్థానిక చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం రామ లింగమ్మ అధ్యక్షతన జరిగిన
ప్రగతిశీల మహిళ సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశంలో ఆ సంఘ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.అధ్యక్షులుగా అదూరి పద్మ , ప్రధాన కార్యదర్శిగా కె.నర్సమ్మ ,
ఉపాధ్యక్షులుగా రామలింగమ్మ ,సహయ కార్యదర్శిగా జయలక్ష్మి ,
కోశాధికారిగా సుజాతతో కార్యవర్గ సభ్యులుగా సైదమ్మ , వాణి , ఉపేంద్ర , ఐలమ్మ , మల్లమ్మ , కావ్య ,నాగమ్మ , శాంతమ్మ , మంగమ్మను ఎన్నుకున్నారు.అనంతరం పలు తీర్మానాలు చేశారు.ఈ సందర్భంగా ఆ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సమ్మ మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు.60 ఏళ్లు దాటిన వారికి ఆసరా పెన్షన్ తో సంబంధం లేకుండా అభయ హస్తం పెన్షన్ ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో విజృంభిస్తున్న విష జ్వరాలను అరికట్టే రకంగా చర్యలు చేపట్టాలని, మొబైల్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని కోరారు.