పిడిఎస్ఎఫ్ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి
పిడిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నాగరాజు
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): కార్పోరేట్ , కాషాయపు కబంధ హస్తాల నుండి విద్యారంగాన్ని పరిరక్షించుకుందామని ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నాగరాజు విద్యార్థులకు పిలుపునిచ్చారు.సోమవారం జిల్లా కేంద్రంలోని రైతు బజార్ సెంటర్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర కార్యవర్గ సభ్యులు , వివిధ విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ఆ సంఘ రాష్ట్ర సదస్సుకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడారు.ఈనెల 22న సూర్యాపేట జిల్లా కేంద్రంలో ర్యాలీని నిర్వహించిన అనంతరం పబ్లిక్ క్లబ్ లో రాష్ట్ర సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ సదస్సుకు ముఖ్య వక్తగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఖాసిం హాజరుకానున్నారని చెప్పారు.ర్యాలీ , సదస్సును జయప్రదం చేయాలని విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి బొజ్జ సైదులు మాదిగ , బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు వీరబోయిన లింగయ్య , టివివి జిల్లా అధ్యక్షులు గుండాల సందీప్ , పిడిఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ మరికంటి హరీష్ , గిరిజన శక్తి జిల్లా నాయకులు ధరావత్ నాగేశ్వరరావు , బీఎస్పీ నాయకులు చెరుకుపల్లి లక్ష్మణ్, శ్యామ్, మధు, పృథ్వి , అజయ్, సాయి తదితరులు పాల్గొన్నారు.
Attachments area