విద్యార్థి వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి

ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి) : కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు పిలుపునిచ్చారు.సోమవారం జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ భవన్ లో జరిగిన ఎస్ఎఫ్ఐ ఫ్లీనరీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టి వేశాయని, విద్యారంగానికి నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానంతో పాఠ్యాంశాల్లో మూఢత్వం, అశాస్త్రీయ భావాలను జోపిస్తుందన్నారు.అశాస్త్రీయ భావాలను తిప్పికొడుతూ శాస్త్రీయ విద్యా విధానానికి ఎస్ఎఫ్ఐ ఉద్యమిస్తుందని పేర్కొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని,తక్షణమే ఆ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.సంక్షేమ వసతి గృహాల్లో మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచి పక్కా భవనాలు నిర్మించాలని కోరారు.ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గురుకులాల్లో సమస్యల వలయంలో ఉన్నాయన్నారు.విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు కావొస్తున్నా గురుకులాల్లో టెండర్లు ఇవ్వలేదని , యూనిఫామ్స్ పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయలేదన్నారు.పెంచిన బస్ పాస్ ఛార్జీల తగ్గించాలన్నారు.ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయన్నారు.ఈ నెల  14, 15, 16వ తేదీలల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలో  రాష్ట్ర 4వ మహాసభలు  నిర్వహిస్తున్నామని,ఈ మహాసభల్లో భాగంగా విద్యారంగ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.ఈ మహాసభల విజయవంతం చేయాలని కోరారు.అనంతరం  నూతన ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీని 13 మంది తో   ఎన్నుకున్నారు.నూతన జిల్లా అధ్యక్ష , కార్యదర్శులుగా  బాణోత్ వినోద్ నాయక్ ,  ధనియాకుల శ్రీకాంత్ వర్మ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి  ధనియాకుల శ్రీకాంత్ వర్మ , బానోత్ వినోద్ నాయక్  ,వేల్పుల ఉత్తేజ్  , జంగంపల్లి సాయి, ఇంద్రాణి  , జానీ, అభి, నర్సింహ, సుమన్, కోటేష్ , సాయి, అనిత తదితరులు పాల్గొన్నారు.
Attachments area