పి ఎస్ బి వాడకంపై అవగాహన

దంతాలపల్లి ఆగస్టు 27 జనం సాక్షి
 మండలంలోని పెద్ద ముప్పారం గ్రామానికి చెందిన కన్నెగంటి రాజేశ్వర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో శనివారం భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా ( పి ఎస్ బి) వాడకంపై  నమూనా పద్ధతి( డెమో) నిర్వహించినట్లు వ్యవసాయ విస్తరణ అధికారి సందీప్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు గండ్ర యాకుబ్ రెడ్డి, బోనాల నర్సయ్య, కోల వీరయ్య తదితరులు పాల్గొన్నారు.