పి డి ఎస్ యు నూతన కార్యవర్గం ఎన్నిక.
గుండాల, అక్టోబర్18(జనంసాక్షి);గుండాల మండలం లోని ప్రభుత్వ జూనియర్ కాలేజి లో జరిగిన గుండాల మండలం పి డి ఎస్ యు 22వ మహాసభలో మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలోని హాస్టల్ మరియు విద్యా సంస్థలలో ఉన్న సమస్యలపై నూతన కార్యాచరణ మరియు పలు తీర్మానాలను ఈ మహాసభ ఆమోదించిందని జిల్లా అధ్యక్షుడు ఏ సాంబ తెలిపారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షురాలు రిషిత ప్రియ, ఉపాధ్యక్షుడు కార్తీక్, ప్రధాన కార్యదర్శి రణదీప్, హాయ్ కార్యదర్శి అంజలి, కోశాధికారి ఆశాజ్యోతి, సభ్యులు రవళి, పవన్, శ్యాం ప్రసాద్, సంపత్, ఈ తొమ్మిది మందితో నూతన కార్యవర్గం ఏర్పాటు చేశారు.