భీమ్‌గల్ ప్రతినిధి(జనంసాక్షి):మండల కేంద్రంలోని సోమవారం నాడు శ్రీ నారాయణ హై స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో వినాయక చవితి సంధర్భంగా భక్తులంతా పీఓపి తో గణపతులకు బదులుగా మట్టితో చేసిన గణపతులనే ప్రతిష్టించుకొని పూజలు చేసుకోవాలని కోరుతూ పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. పీఓపి గణపతి వద్దు మట్టి గణపతులే ముద్దు అంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. మట్టి గణపతుల ద్వారా పర్యావరణానికి హాని కలుగకుండా కపడుకోవచ్చని అన్నారు.గత పది సంవత్సరాల నుండి మట్టి గణపతులను చేయించి ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ఈ సంవత్సరం కూడా వినాయక చవితి సంధర్భంగా బుధవారం నాడు మట్టి గణపతులను పంపిణీ చేస్తామని పాఠశాల కరస్పాండెంట్ లు ప్రసాద్,ప్రవీణ్ తెలిపారు. ఈ ర్యాలీ లో అధ్యాపక బృందం ప్రకాష్,శ్రీనివాస్, కీర్తి, అనూష,వరలక్ష్మీ, కవిత, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
పీఓపి గణపతి వద్దు మట్టి గణపతులే ముద్దు




