Thursday, 5 November 2026

పీపుల్స్ పాలీ క్లినిక్ ను ప్రారంభించిన :ముద్దగౌని లక్ష్మి ప్రసన్న రామ్మోహన్ గౌడ్

 ఎల్బీ నగర్ (జనం సాక్షి  ) పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందించాలని బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం  బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ సాహెబ్ నగర్ మెయిన్ రోడ్ లోని ఎస్బిఐ బ్యాంక్ ప్రక్కన నిర్వాహకులు పి.దిలీప్ కుమార్ గౌడ్ నూతనంగా ఏర్పాటు చేసిన పీపుల్స్ పాలి క్లినిక్ ప్రారంభ కార్యక్రమానికి లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజల్వన చేసి  రిబ్బన్ కట్ చేసి     క్లినిక్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు అతి తక్కువ ఖర్చుతోనే మెరుగైన వైద్య సహాయం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హిమబిందు, డాక్టర్ సులాఫాని, డాక్టర్ సుదర్శన్ గౌడ్, క్లినిక్ యాజమాన్యం,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.