అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 15
పేద ప్రజలకు అండగా నిలిచిన నాయకుడు సీఎం కేసీఆర్. పెదింటి ఆడబిడ్డల పెండ్లి ల కోసం కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి పథకాలు ప్రవేశపెట్టడం గొప్పవరం అని మల్కాజిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. అల్వాల్ సర్కిల్ కి సంబంధించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 47 మంది కి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే గురువారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు పేదలను పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ పేదల పెన్నిధిగా మారాడని ప్రశంసించారు. సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబిత అనిల్ కిషోర్, సునీత, మీనా, ప్రేమ్, జగదీష్ గౌడ్, కవిత, సాయిరాం గౌడ్, నిరంజన్, తదితరులు పాల్గొన్నారు.




