బజార్ హత్నూర్ ( జనం సాక్షి ) : బజార్హత్నూర్ మండలంలోని సుంగుగూడ గ్రామంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఊరు మొత్తం వర్షం నీటితో నిండి ప్రజలు అవస్థలు పడుతున్నారు మండలాన్ని సందర్శించిన బలరాం జాదవ్ ఆ గ్రామానికి వెళ్ళి అక్కడి పరిస్థితులు సమీక్షించారు గ్రామస్తుల వివరాల ప్రకారం రెండు మూడు పెద్ద వర్షాలు కురిస్తే గ్రామమంతా నీటితో నిండిపోతుందని దీని వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు ఇలాంటి వర్షాలతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని పోయినేడు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నామని వర్షం ఎక్కువగా కురవడం వలన గ్రామస్తులకు పక్కనే ఉన్న సోనేరావ్ గూడలో అధికారులు పునరావాసం కలిపించారు దాదాపు 30,35 కుటుంబాలు నివాసముంటున్న వీరిని బలరాం జాదవ్ సోనేరావ్ గూడకు వెళ్ళి కలిసారు వారి ఆరోగ్య ఆహార పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు బలరాంతో పాటు వైస్ ఎంపీపీ పొరెడ్డి శ్రీనివాస్ ఎంపీటీసీ గజానంద్ సర్పంచ్ దుర్వా సుభాష్ మండల ఉపాధ్యక్షులు సూర్యకాంత్ వారే సంగామ్ రాంజీ పటేల్ దేవ్ రావు పటేల్ బీజేవైఎం అనిల్ తదితరులు ఉన్నారు
పునరావాస కేంద్రాన్ని సందర్శించిన బలరాం జాదవ్




