హైదరాబాద్: పురపాలక ఎన్నికలను ఏ (2001 లేదా 2011) జనాభా లెక్కల ప్రకారం జరపాలన్న అంశంపై చర్చిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి తెలియజేశారు. అయితే దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల స్థానాలు పెరుగుతాయని మంత్రి తెలియజేశారు.




