హైదరాబాద్: తేపానుతో కోస్తాంధ్ర అతలాకుతలం అవుతుంటే మంత్రులు, ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లడం ఎంతవరకు సమంజసమని తెదేపా ప్రశ్నించింది. చేతికి వచ్చిన పంట నష్టపోయి దిక్కుతోచని స్థితిలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆ పార్టీ నేతలు బొజ్జల, మండవ వెంకటేశ్వరరావులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇన్‌ఛార్జి మంత్రి మంత్రులు ఏం చేస్తున్నారో తెలియజేశారు. పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. ఇంద దౌర్భగ్యమైన స్థితి రాష్ట్రంలో ఎప్పుడూ చూడలేదన్నారు. విశాఖకు వచ్చిన ముఖ్యమంత్రి కనీసం వరదలు, నీలం తుపాను గురించి సమీక్షించ లేదని ఆరోపించార. క్షేత్ర స్థాయిలో సహాయక చర్యల్లో పాల్గొనాల్సిన అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.




