బోనగిరి టౌన్ (జనం సాక్షి):–
భువనగిరి పురపాలక సంఘంలో నూతనంగా 28 మంది కార్మికులను ఔట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకున్న వాళ్లను నియమ నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు దన్నుకొని ఒక్క పోస్ట్ కు 65 వేల నుండి రెండు లక్షల వరకు అధికార బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆల్ఫా ఏజెన్సీని అడ్డుగా పెట్టుకొని ఉద్యోగాలు ఇప్పించిన దానిపై చర్యలు తీసుకోవాలని నూతనంగా 28 మంది కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికులగా తీసుకున్న వాళ్లను పారిశుద్ధ్య పనులు చేయించకుండా వాళ్లను స్వచ్ఛ సర్వేక్షన్, జియో టాకింగ్, మరియు రెవెన్యూ సెక్షన్ మరియు ఇంజనీరింగ్ సెక్షన్ వాటర్ సప్లై లలో విధులు నిర్వహించేటట్లు వెసులుబాటు కల్పించడాని ఖండిస్తూ, మున్సిపల్ చెత్త టాక్టర్ పై మున్సిపల్ చెత్త ఆటోలపై విధులు నిర్వహిస్తున్న కార్మికులకు వారంలో ఒకరోజు సెలవు కల్పించాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐ ఎన్ టి యు సి అధ్యక్షులు పడిగెల ప్రదీప్ పారిశుద్ధ కార్మికులతో కలిసి మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డికి వినతిపత్రం సమర్పించి మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు గత 20 సంవత్సరాల నుండి డిగ్రీలు పేజీలు చదువుకొని సీనియర్ లుగా మున్సిపల్ లో పారిశుద్ధ కార్మికులుగా పనులు చేస్తున్న వాళ్లను పక్కనపెట్టి నూతనంగా 28 మంది ఔట్సోర్సింగ్ కార్మికులను తీసుకున్న వాళ్లను ఒక్కరోజు కూడా పారిశుద్ధ విభాగంలో పనిచేయని వాళ్లను డైరెక్ట్ గా ఆఫీసులో స్వచ్ఛ సర్వేక్షన్, జియో టాకింగ్, రెవెన్యూ సెక్షన్, ఇంజనీరింగ్ సెక్షన్, వాటర్ సప్లై లో తీసుకోవడాన్ని కార్మికులు కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈమున్సిపాలిటీలో ఎన్నో సంవత్సరాలుగా తరబడి దళిత కుటుంబాలు సేవ చేసి ఎలాంటి రాయితులు పొందకుండా ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఎన్ఎంఆర్ ల కుటుంబాలను వంతుల వారీగా చేస్తున్న కార్మికులను మున్సిపల్ ఔట్సోర్సింగ్ పద్ధతిలో కార్మికులగా తీసుకోకుండా అల్ప ఏజెన్సీ వారు అక్రమాలకు పాల్పడి కార్మికులను రిక్రూమెంట్ చేసుకున్న దాని పట్ల పూర్తిగా విచారణ జరిపించి ఆల్ఫా ఏజెన్సీని వెంటనే రద్దు చేయాలని అలాగే మున్సిపల్ చెత్త టాక్టర్లపై మున్సిపల్ చెత్త ఆటోలపై విధులు నిర్వహిస్తున్న కార్మికులకు వారంలో ఒక్కరోజు సెలవుగా ఇవ్వాలని చెత్త టాక్టర్ పై కంపల్సరిగా నలుగురు కార్మికులు ఉండేటట్లుగా చర్యలు తీసుకోవాలని నూతనంగా తీసుకున్న 28 మంది కార్మికులను మాలో ఎవరైనా ఆబ్సెంట్ అవుతే మా స్థానంలో వాళ్లతో విధులు నిర్వహించినట్లు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐ ఎన్ టి సి పక్షాన డిమాండ్ చేయడం జరిగింది,ఈకార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ తంగళ్ళపల్లి రవికుమార్ కౌన్సిలర్ ఈరపాక నరసింహ పచ్చళ్ళ జగన్ సలావుద్దీన్ జనగాం నరసింహ చారి పారిశుద్ధ్య కార్మికులు కుమార్ శ్రీధర్ నరేందర్ సుధాకర్ శైలేందర్ రాజు నరేష్ బిక్షపతి బాబు రాములు శంకరయ్య లింగం సత్తి మధు తదితరులు పాల్గొనడం జరిగింది.
పురపాలక సంఘంలో నియమ నిబంధనలకు విరుద్ధంగా సీనియార్టీ లేకుండా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను ఆఫీసులో విధులు నిర్వహించడంపై మున్సిపల్ కార్మికుల నిరసన కమిషనర్ కు వినతి… మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐ ఎన్ టి యు సి అధ్యక్షులు పడిగెల ప్రదీప్…




