అందోలు-జోగిపేట మున్సిపల్ పరిధిలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పురాతన ఇండ్లు పూర్తిగా నాని పోవడంతో ఆ ఇండ్లు ఎప్పుడు కూలిపోతాయోనని ఆ ఇండ్లలో నివసిస్తున్న ప్రజలు భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుత వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని పురాతన ఇళ్లలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గురువారం జోగిపేట పట్టణంలోని బాబా నగర్ కాలనీలో కౌన్సిలర్ రమేష్ ఆధ్వర్యంలో శానిటరీ ఇన్స్పెక్టర్ వినయ్ ఆధ్వర్యంలో రెస్క్యూ టీం పర్యటించింది. కూలిన ఇళ్లను పరిశీలించారు.




