Wednesday, 4 November 2026

పురుషాధిక్య ఆధిపత్యాన్ని ప్రోత్సహిస్తున్న మనువాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం.

 

–

 

 

పీ.ఓ.డబ్ల్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.హరిత.

బై0సా. రూరల్ మార్చ్ 08 జనం సాక్షి

సమాజ మనుగడకు మనువాదం పెను ప్రమాదకరంగా మారిందని, మనువాదానికి వ్యతిరేకంగా స్రీలు పోరాడాలని, ప్రగతిశీల మహిళా సంఘం(పీ ఓ డబ్ల్యూ) రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం. హరిత అన్నారు.బుధువారం భైంసాలో అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాటదినంను జరిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ….మనువాద ఆలోచన మనుషులను ముఖ్యంగా అట్టడగు వర్గాలు,దళితులను హీనంగా చూడటం,విద్యకు,వికాసానికి,సౌకర్యాలకు దూరం చేయడం,అణిగిమణిగి ఉంటూ,అగ్రవర్ణాలకు ఊడిగం చేసే సంస్కృతిని అభివృద్ది చేయడమే మనువాదం యొక్క విధానంఅని,అందుకే మనువాదం నేడు ప్రజలకు ప్రధాన శత్రువుగా పరిగణించాలన్నారు.ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యూ జిల్లా అధ్యక్షులు వెంకటేష్,జ్యోతి మేడం, విద్యార్థులు పాల్గొన్నారు.