డోర్నకల్ జూలై 30 జనం సాక్షి
గ్రామ రెవిన్యూ సహాయకులు గత కొద్ది రోజులుగా రెవిన్యూ కార్యాలయం ఎదురుగా సమ్మె చేస్తున్న విషయం విధితమే.శనివారం తమ సమస్యల సమ్మెకు మద్దతు తెలపాలని తాసిల్దార్ వివేక్,డీటీ సుధాకర్ కు గులాబీ పువ్వులు ఇచ్చి శిబిరానికి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మండల వీఆర్ఏ సంఘం చైర్మన్ బాలకృష్ణ మాట్లాడుతూ… రాష్ట్ర సీఎం కెసిఆర్ అసెంబ్లీలో ప్రకటించిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు విజయ్ సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతు పలికారు. కార్యక్రమంలో బీఎస్పీ ఉపేందర్,మండల కన్వీనర్ కొండ్రు అరుణ్,వీఆర్ఏలు సురేష్,సాయి,డానియల్,కవిత, భారతి,చంద్రశేఖర్,యాదగిరి,రామకృ ష్ణ తదితరులు పాల్గొన్నారు.




