Tuesday, 3 November 2026

పూర్తి కావస్తున్న బీమా సర్వే

పూర్తి విరాలను ఆన్‌లైన్‌లో పొందు పర్చేలా చర్యలు

హైదరాబాద్‌,జూలై4(జ‌నం సాక్షి ): రైతు బంధు పక్రియను విజయవంతంగా పూర్తిచేసిన వ్యవసాయశాఖఅధికారులు ప్రస్తుతం రైతు బీమా సర్వేలో బిజీగా ఉన్నారు. ఇరవై రోజులుగా వ్యవసాయ అధికారులు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ఆయా మండలాలు, గ్రామాల్లోని రైతు సమన్వయ సమితి సభ్యుల సహకారంతో ప్రతీ రైతు ఇంటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు, ఆధార్‌ కార్డ్‌ ఆధారంగా రైతుల పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. 18 నుంచి 59 ఏళ్లలోపు వయసు గల రైతుల సమగ్ర సమాచారాన్ని సేకరించి ఫారంలో పొందుపొరుస్తున్నారు. ఈ నెల 10 వరకు గడువు ఉండటంతో ఆ రోజు కల్లా వివరాల సేకరణ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. అన్నదాత సంక్షేమం కోసం రైతు బీమాను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. రైతు ప్రమాదవశాత్తు మరణించినా, సహజంగా చనిపోయినా ఆ కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సౌకర్యం వర్తించేలా ప్రణాళికను రూపొందించింది. ఈ మేరకు మార్గదర్శకాలను వ్యవసాయశాఖ అందజేసింది. జిల్లా వ్యాప్తంగా అర్హులైన రైతుల వివరాలు సేకరించి అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ గత ఇరవై రోజులుగారైతు బీమా సర్వేలో బిజీ అయ్యారు. ఇందులో భాగంగా ఇటీవల ప్రారంభించిన రైతు బీమా సర్వే జిల్లాల్లో జోరుగా కొనసాగుతోంది. లక్షల మంది రైతుల సర్వేకు వ్యవసాయ అధికారులు నడుం బిగించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా వ్యవసాయ అధికారులు అర్హులుగా ఉన్నవారిని గుర్తించారు. రైతు బీమా సర్వే 70 శాతానికిపైగా పూర్తయిట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. భూ రికార్డుల ప్రక్షాళన, రైతు బంధు పథకంలో భాగంగా ఇటీవలే రైతులందరికీ పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు, ముందస్తు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ. 4 వేల చొప్పున అందజేశారు. అధికారులకు స్థానిక రైతు సమన్వయ సమితి సభ్యులు సహకారం అందిస్తున్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాల ప్రకారం 70 శాతం సర్వేను పూర్తి చేశారు.మరో వారం రోజుల్లో పూర్తి చేసేందుకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. అర్హులైన రైతుల జాబితానుఆన్‌లైన్‌ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 10 వరకు గడువు ఉన్నందున ఆనాటి కల్లా సర్వే పక్రియను పూర్తి చేయడంతో పాటు అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు వ్యవసాయశాఖ కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌ ఎప్పటికప్పుడు రైతు బీమా సర్వేపై సవిూక్షలు జరుపుతూ త్వరితగతిన పూర్తి చేసేలా సూచనలు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు.