పెంచాయతీ ట్రాక్టర్ను లాక్కెళ్లిన కాంట్రాక్టర్

సీసీ రోడ్డు బిల్లు చెల్లించకపోవడంతోనే..

బెజ్జూర్: సీసీ రోడ్డు పనులు చేసి నెలలు గడిచినా బిల్లు రాకపోవడంతో ఓ కాంట్రాక్టర్ ఏకంగా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను లాక్కెళ్లిన ఘటన మండలం లోని లంబాడిగూడ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. లంబాడిగూడ గ్రామపంచాయతీకి చెం దిన ముడిమడుగుల పెంటయ్య కొద్దినెలల క్రితం దాదాపు రూ.5 లక్షల విలువైన సీసీ రోడ్డు నిర్మిం చాడు. మూడు నెలలవుతున్నా బిల్లు రాలేదు. పలుసార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో గ్రామపంచాయతీ ట్రాక్ట ర్ను గురువారం లాక్కెళ్లి ఇంటి ముందు పెట్టుకు న్నాడు. బిల్లు చెల్లించేదాకా ట్రాక్టర్ను ఇచ్చేది లేదని చెబుతున్నాడు. తాను నిర్మించిన సీసీ రోడ్డు బిల్లు సర్పంచ్ ఖాతాలో జమ కాగా తనకు ఇవ్వడంలేదని ఆరోపించాడు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని పేర్కొన్నాడు.

తాజావార్తలు