రేషన్ డీలర్ల సంఘం నేతలు మరియు సభ్యులు నల్గొండ లోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ని కలిశారు.
రేషన్ డీలర్ల సంఘం నేతలు మరియు సభ్యులు నల్గొండ లోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ని కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి కి మరియు గుత్తా సుఖేందర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. తమ డిమాండ్స్ అన్నింటినీ పరిశీలించి తమకు న్యాయం చేసిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎల్లకాలం రుణపడి ఉంటామని రేషన్ డీలర్లు తెలిపారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచింది అన్నారు. రాష్ట్రంలో దాదాపు 90 లక్షల మందికి రేషన్ సరుకులు సరఫరా చేస్తున్న రేషన్ డీలర్లు కూడా సంతోషంగా జీవించాలనే భావనతో వారికి ఇచ్చే కమిషన్ ను తెలంగాణ ప్రభుత్వం భారీగా పెంచిందని అన్నారు. మెట్రిక్ టన్నుకు 200 రూపాయలు ఉన్న కమిషన్ ను 1400 రూపాయలకు పెంచడం జరిగిందని చెప్పారు. 139 కోట్ల రూపాయల భారాన్ని మోస్తూ 17,227 రేషన్ డీలర్లు కుటుంబాల్లో సంతోషాన్ని నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర నేతలు,జిల్లా నేతలు, తదితరులు పాల్గొన్నారు