హైదరాబాద్: పెంచిన పెట్రోల్,డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. హిమాయత్ నగర్ సీపీఐ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ప్రభుత్వ దిష్టి బొమ్మను తగుల బెట్టారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ 15 రోజుల్లోనే మరో సారి పెట్రోల్ ధరలు పెంచడం దారుణమన్నారు. మోదీ, కేసీఆర్, చంద్రబాబు కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు.




