Wednesday, 4 November 2026

నంది నాటకోత్సవాలను ప్రారంభించిన మంత్రి మాణిక్యాలరావు

రాజమండ్రి :నంది నాటకోత్సవాలను దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు రాజమండ్రిలోని ఆనం కళాకేంద్రంలో శనివారం ప్రారంభించారు. జూన్ 1వ తేదీ వరకూ జరిగే ఈ నాటకోత్సకాల్లో 84 నాటకసమాజాల నుంచి 2500 మంది కళాకారులు హాజరు కానున్నారు. బాల నాటికలు, పద్య నాటికలు, పౌరాణిక, సాంఘిక నాటకాల విభాగంలో పోటీలు జరగనున్నాయి. నంది నాటకోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి ఎంపీ మురళీ మోహన్ కూడా హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *