పెండింగులో ఉన్న పిటిషన్లను సత్వరమే పరిష్కరించాలి
కలెక్టర్ కె శశంక
మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్29(జనంసాక్షి)
జిల్లాలో రెండు వారాల కంటె ఎక్కువ రోజులు పెండింగ్ లో ఉన్న ప్రజావాణి పిటిషన్ లను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణిలో జిల్లా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల పిటిషన్లను స్వీకరించి తగుచర్యకై సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు వివిధ శాఖాదికారుల వద్ద పెండింగ్ లో ఉన్న పిటిషన్లపై కలెక్టర్ సమీక్షించారు. ఆగష్టు 1 నాటికి 377 పిటిషన్లు పెండింగ్ లో ఉన్నవని వాటిపై సత్వర చర్యలు తీసుకుని వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తమ కార్యాలయంలో ఉన్న పెండింగ్ పిటిషన్లపై జిల్లా అధికారులు స్వయంగా సరిచూసుకుని తగు పరిష్కార చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. సర్వే ల్యాండ్, జిల్లా పరిషత్, మున్సిపల్ కమిషనర్లు, రెండు డివిజనల్ అధికారులు, నీటి పారుదల శాఖ కార్యాలయాలలో ఎక్కువ సంఖ్యలో ప్రజావాణీ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపి వీటిని సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అభిలాష అభినవ్, జిల్లా అధికారులు తదితరులు ప్రజావాణిలో పాల్గొన్నారు.