బెల్లంపల్లి, ఏప్రిల్ 28, (జనంసాక్షి )బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం మెట్ పల్లి గ్రామానికి చెందిన దుగుట రవి (40)సo” లు యువ రైతు గుండె పోటుకు గురై చికిత్స పొందుతూ శుక్రవారం ఆసుపత్రిలో మృతి చెందాడు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం దుగుట రవి భూమినీ నమ్ముకోనీ వ్యవసాయం చేసుకొని బ్రతికే క్రమంలో రవి ఈఏడాది యాసంగిలో ఎకరం భూమి లో ఆడ మగ వరి పంట సాగు చేశాడు. పంట ఆశాజనకంగా లేదు. దీనికి తోడు ప్రకృతి సైతం సహకరించడం లేదు. పొలంలో తాడు కొట్టే క్రమంలో హఠాత్తుగా ఛాతీ లో నొప్పి రావడం తో భార్య ఏం జరిగింది అని రవి ని అడగగా మనం వేసిన వరి పంట పెట్టుబడి రావడం కష్టం గా ఉంది అని అప్పులపాలు అవుతానని ఆందోళన చెందుతు భార్య కు చెప్పినట్టు వివరించారు. ఆశించిన మేర పంట చేతికి రాదేమో, అధికంగా పంట నష్టం వాటిల్లి, ఆర్థికంగా నష్ట పోతాను అని ఆందోళనకు గురై గుండె పోటుకు గురై మృతి చెందాడని వివరించారు. తమ కుటుంబాలను ప్రభుత్వo, మరియు ఆడ మగ వరి విత్తనాలు సరఫరా చేసిన కంపెనీ ఆదుకోవాలని వేడుకుంటున్నారు. పెద్ద దిక్కును కోలిపోయిన రెండు కుటుంబాలు రవి పై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని, కుటుంబం రోడ్డున పడిందని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు.




