Wednesday, 4 November 2026

పెట్టుబడి సాయంపై కెసిఆర్‌ ఆరా

హైదరాబాద్‌,మే25(జ‌నంసాక్షి): పెట్టుబడి సాయం అందించడం ద్వారా రైతులకు భరోసా కల్పించాలని సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన రైతుబంధు పథకం చెక్కుల పంపిణీ దాదాపు పూర్తి కావచ్చొంది. చిన్న చిన్న సమస్యలతో అక్కడక్కడ చెక్కులు, పాస్‌ బుక్కుల పంపిణీలో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పలుచోట్ల పరిస్థితిని సీఎం కేసీఆర్‌ స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రతి రైతుకు రైతుబంధు చెక్కు అందేవిధంగా చూడాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పర్యవేక్షించాలని సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి సీఎం కేసీఆర్‌ సూచించారు. ఎమ్మెల్యే రామలింగారెడ్డికి ఫోన్‌ చేసిన ముఖ్యమంత్రి, రైతుబంధు చెక్కులు, పాస్‌ పుస్తకాల పంపిణీ, భూ ప్రక్షాళన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. పాస్‌ పుస్తకాల్లో జరిగిన తప్పులను సరిదిద్దేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారా? అని అడిగారు. సవిూక్ష తరవాత అధికారలుఉ ఎలా పనిచేస్తున్‌ఆనరన్నది కిందిస్థాయిలో నివేదిక తెప్పిస్తున్నారు.