ఉద్దానంపై చిత్తశుద్దితో పనిచేస్తున్నాం: గంటా
విశాఖపట్టణం,మే25(జనంసాక్షి): ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటున్నామన్నారు. ఇందులో రెండో ఆలోచన గానీ, ప్రభుత్వ చిత్తశుద్దిని శంకించాల్సిన అవసరం కానీ లేదన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు పట్టించుకోనవసరం లేదని మంత్రి పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో మూత్రపిండాల వ్యాధి తీవ్రం కావడంపై ప్రభుత్వం దృష్టికి రాగానే యుద్ధప్రాతిపదికన స్పందించి తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ నెల 27, 28న డల్లాస్‌లో ఎన్‌ఆర్‌ఐల ఆధ్వర్యంలో మహానాడు జరగనుందని మంత్రి గంటా చెప్పారు.