పెట్రామ్ చేలక స్టేజి గ్రామంలో పిడుగుపాటుకు యువరైతు దుర్మరణం
టేకులపల్లి ,సెప్టెంబర్ 9( జనం సాక్షి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని పెట్రాంచలకా స్టేజి గ్రామంలో పిడుగు పాటుకి యువ రైతు దుర్మరణం చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పెట్రాంచేలక స్టేజి గ్రామానికి చెందిన ఇస్లావత్ బావ్ సింగ్ ,వీరమ్మ దంపతుల కుమారుడైన ఇస్లావత్ వసంత్ (22) ఈరోజు పత్తి చేనులో పాటు చేస్తుండగా మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తుండడంతో అరక ఆపి చెట్టు కిందికి వెళ్ళాడు . పిడుగుపాటుకు అక్కడికక్కడే మృతి చెందాడు. బావ్ సింగ్ కి నలుగురు సంతానంలో పెద్ద కుమారుడు మానసికంగా సరిగ్గా లేక కొన్ని సంవత్సరాల కింద చనిపోయాడు. ఒక అమ్మాయి పెళ్లి చేశాడు .ఉన్న ఇద్దరు అబ్బాయిలలో పిడుగుపాటుకు దుర్మరణం పాలైన పెద్ద కుమారుడు చేతికి అందిన కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది.