” మట్టి వినాయకులను పూజిద్దాం… పర్యావరణాన్ని కాపాడుకుందాం – బిజెపి నేత ప్రజల యోగానంద్”

శేరిలింగంప‌ల్లి, ఆగస్టు 29( జనంసాక్షి): మనసులో భక్తి ఉంటే భగవంతుని ఆశీస్సులు తప్పకుండా అందుతాయని, ఇదే నమ్మకంతో రసాయనాలతో చేసిన గణేష్ ప్రతిమలకు బదులు మట్టి వినాయకులను పూజించాలని, తద్వారా పర్యావరణహితానికి శ్రీకారం చుట్టాలని భారతీయ జనతా పార్టీ శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ గజ్జల యోగానంద్ పిలుపునిచ్చారు. ఈమేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై బిజెపి నాయకులు, కార్యకర్తలకు, స్థానికులకు పెద్ద ఎత్తున యోగానంద్ ఆధ్వర్యంలో  మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యోగానంద్ మాట్లాడుతూ ప్రకృతి లో మమేకం అవుతూ మట్టి గణపతిని పూజించాలని పర్యావరణం పై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి వ్యక్తి కూడా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలని ఆయన కోరారు. శేరిలింగంపల్లి  నియోజకవర్గ ప్రతి డివిజన్లో  మట్టి గణపతి విగ్రహాలను ఆయన ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ల అధ్యక్షులు కార్యకర్తలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.