పెద్దిరెడ్డికి జైపాల్ ఫోన్
హైదరాబాద్: శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలన్న చిత్తూరు జిల్లా పుంగనూరు శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సముదాయించేందుకు కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు. పెద్దిరెడ్డికి కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి ఫోన్ చేసి తొందరపడవద్దని సూచించినట్టు తెలియవచ్చింది, ఈ నెలాఖర్లోగా ముఖ్యమంత్రిని తప్పించకపోతే తాను ఎమ్మెల్యు పదవినుంచి తప్పుకుంటానని పెద్దిరెడ్డి గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. జైపాల్‌రెడ్డితో పాటు పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా పెద్దిరెడ్డికి నచ్చెజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.



