పెద్దేముల్ మండల సీనియర్ నాయకుడు జడ్పిటిసి ధారాసింగ్ నాయక్ నుండి డెలిగేట్ పదవి తొలగించడం

పెద్దేముల్ అక్టోబర్ 18 (జనం సాక్షి)
పెద్దేముల్ మండల సీనియర్ నాయకుడు జడ్పిటిసి ధారాసింగ్ నాయక్ నుండి డెలిగేట్ పదవి తొలగించడం పై సోమవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శోభారాణి, మండల పార్టీ అధ్యక్షులు గోపాల్, మండల వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి మాట్లాడుతూ… పెద్దేముల్ మండల రాజకీయాలలో ఓటమి ఎరుగని నాయకునిగా గత ముప్పై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో  ధారసింగ్ కొనసాగుతున్నారు.పార్టీ అధిష్టానం సీనియర్ నాయకుడైన టిపిసిసి డెలిగేట్ పదవిని ధారసింగ్ కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆ పదవిని వేరే నాయకునికి ఇవ్వడం పార్టీ పెద్దలకు ఎంతవరకు సమంజసమని అన్నారు. ఇప్పటికైనా ధన సింగ్ నాయక్ డెలిగేట్ పదవి కన్న అత్యున్నత పదవి ఇచ్చే విధంగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెండ్యాల ప్రవీణ్ కుమార్, పెద్దేముల్ ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, లొంక నర్సింలు, న్యాయవాది ఎల్లారెడ్డి, గోపాలకృష్ణ, రాము నాయక్, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.