Tuesday, 3 November 2026

పెన్షన్‌ రాలేదని నిప్పంటించుకున్న వికలాంగుడు

బిజినేపల్లి, మార్చి 25: పెన్షన్‌ రాలేదని మనస్తాపంతో ఓ వికలాంగుడు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం జిల్లాలోని బిజినేపల్లి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట జరిగింది. దరఖాస్తు చేసుకున్న పెన్షన్‌ రాలేదని ఓ వికలాంగుడు ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *