పెన్షన్ కార్డుల పంపిణీ
చెన్నూర్, (జనంసాక్షి): చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదేశాలమేరకు భీమారం మండలం బూరుగుపల్లి గ్రామ పంచాయతీ లో నూతన ఆసరా పింఛన్ లబ్ధిదారులకు గ్రామ సర్పంచ్ వడ్లకొండ రమాదేవి తిరుపతి చేతుల మీదుగా పెన్షన్ కార్డులు పంపిణి చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పేదల పెన్నిధి కెసిఆర్ ప్రవేశపెట్టిన ఆసరా పెన్షన్ పేదలకు ఎంతో ఆసరాగా ఉందని కొనియాడారు. బూరుగుపల్లి గ్రామ పంచాయతీ లో కొత్తగా 25మందికి పెన్షన్ సాంక్షన్ కావడంతో తెలంగాణ ప్రదాత ముఖ్యమంత్రి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పెద్దల రూప బాపు, యువ నాయకులు భూక్యా లక్ష్మణ్ నాయక్ , చెన్నూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూక్యా రాజ్ కుమార్ నాయక్, ఉపసర్పంచ్ పెదం శంకర్, వార్డు మెంబెర్ పోర్తిక పద్మ, తెరాస విద్యార్థి అధ్యక్షులు భూక్యా రాజేష్ నాయక్, రైతు బందు అధ్యక్షులు ధరవత్ అశోక్ నాయక్, భూక్యా దేవు నాయక్ భూక్యా రమేష్, కలగూర తిరుపతి, నీలాల లక్ష్మి ,ధరవత్ అనిత, సీనియర్ నాయకుడు దారావత్ రూపుల నాయక్, శంకర్ నాయక్, బానోత్ సురేష్, రాములు, భూక్యా చాందియా నాయక్, వడ్లకొండ మల్లేష్, గట్టయ్య, పంచాయతీ సెక్రటరీ బండి రాజశేఖర్, రమేష్ ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.