*పెబ్బేరులో ఘనంగా శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు*

పెబ్బేరు జులై 28 ( జనంసాక్షి ): పెబ్బేరు వీరంపేట శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి ఉత్సవాలను
 తోగుట వీర క్షత్రియ సంఘము ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వీరంపేట శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారికి అర్చన, హారతి మహిళల చే సామూహిక అభిషేకాలు నిర్వహించారు, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ అనంతరం తొగుట వీర క్షత్రయ సంఘముఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.రాత్రికి భజన కార్యక్రమాలు నిర్వహించారు.కార్యక్రమంలో  నరసింహ, ఆంజనేయులు, గోపాల్,వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు