Tuesday, 3 November 2026

హెచ్.ఎమ్.డబ్ల్యు .ఎస్ ఎస్ బి ఆధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన – కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి

ఎల్బీ నగర్ (జనం సాక్షి )  బి యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని చైతన్య నగర్ లో డ్రైనేజ్ పైప్లైన్ తరచుగా పొంగి పోతుందని పలుమార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోకపోవడంపై అధికారుల పై బి యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి  ఆగ్రహం వ్యక్తం చేసారు .  ఈ సందర్భగా  కార్పొరేటర్ గారు మాట్లాడుతూ ఆధికారులు నిర్లక్ష్యం వల్ల కాలనీలో డ్రైనేజ్ సమస్య పరిష్కారం కావడం లేదని తరచూ రోడ్లపైనే మురుగునీరు చేరి ప్రజలకు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పినా పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ GM బలరాంరాజు, DGM శ్రీనివాస్, మేనేజర్ రవీందర్ రెడ్డి, పార్టీ డివిజన్ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, కిషోర్ మరియు తదితరులు పాల్గొన్నారు.
Attachments area