Tuesday, 3 November 2026

పెళ్లిమాటే మర్చిపోయారు..!

త్వరలోనే పెళ్లి పీటలెక్కుతారని భావిస్తున్న టాలీవుడ్ పెయిర్ నాగచైతన్య, సమంతలు ఆ మాటే మర్చిపోయారనిపిస్తుంది. చాలా రోజుల కిందటే ఈ జంటకు నిశ్చితార్థం కాగా ఈ వేసవిలో వివాహ వేడుక ఉంటుందన్న ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించటం లేదు. వరుస సినిమాలకు కమిట్ అవుతూ చైతూ, సమంతలు కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇప్పటికే రారండోయ్ వేడుక చూద్దా సినిమా షూటింగ్ పూర్తి చేసి చైతూ, కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ప్రేమమ్ లాంటి సూపర్ హిట్ అందించిన దర్శకుడు చందూ మొండేటితో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు. వీటితో పాటు ప్రేమమ్ సినిమాను నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మరో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు. ఈ రెండు సినిమాలను జూలై నుంచే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *