పెళ్లి పీటలకు ఎక్కనున్న నటి పూర్ణ
ప్రముఖ నటి పూర్ణ తన కాబోయే భర్తను పరిచయం చేసి సర్‌ప్రైజ్ చేసింది. ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు తారలు పెళ్ళి చేసుకొని కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే పూర్ణ కూడా త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడిరచింది. తెలుగులో పూర్ణ నటించిన మొదటి సినిమా శ్రీ మహాలక్ష్మి. నటుడు, దరకుడు రవిబాబు తెరకెక్కించిన అవును , అవును 2, అలాగే అల్లరి నరేష్ హీరోగా నటించిన సీమ టపాకాయ్ చిత్రాలలో హీరోయిన్‌గా నటించి టాలీవుడ్‌లో మంచి గుర్తింపును తెచ్చుకుంది.