Friday, 6 November 2026

పేకాట ఆడితే జైలుకె సదాశివనగర్ సిఐ రామన్

గాంధారి జనంసాక్షి అక్టోబర్ 18-
 గాంధారి మండలం తాడ్వాయి సదాశివ నగర్ మండల ప్రజలకు  దీపావళి పండుగ సందర్భంగా ఎవరైనా పేకాట ఆడిన ఆడించిన వారిపై కఠిన చర్యలు తీసుకొని జైలుకు పంపడం జరుగుతుందని సదాశివనగర్ సిఐ రామన్ తెలిపారు ఈ సందర్భంగా సదాశివనగర్ సిఐ రామన్ మాట్లాడుతూ ఎక్కడైనా బహిరంగ ప్రదేశాలలో లేక ఇండ్లలో వ్యవసాయ బావులు వద్ద దుకాణాలు సముదాయాల్లో ఎవరైనా పర్సనల్గా పేకాట క్లబ్బుని ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఎవరి స్థలంలోనైనా యజమానికి తెలిసిన తెలియకుండా అయినా  ఆడితే పోలీసులకు తెలియజేయాలన్నారు లేకుంటే వారి పైన కూడా కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందన్నారు ఎక్కడైనా నివాస స్థలాలకు దూరంగా కాలువల్లో చెట్ల పొదల్లో పేకాట ఆడినట్టయితే స్థలం వారు పోలీసులకు సమాచారం ఇస్తే వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు పేకాట ఆడి ఇల్లు గుల్ల  భార్య పిల్లలతో గొడవలు పడడం పచ్చని సంసారం సర్వనాశనం చేసుకోవడం జరుగుతుందని ఇలాంటి వాటిని అరికట్టడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని సదాశివనగర్ సిఐ రామన్ తెలిపారు ఇది సదాశివనగర్ గాంధారి తాడ్వాయి మండలాల పరిధిలోని గ్రామ ప్రజలకు వర్తిస్తుందని సదాశివనగర్ సిఐ రామన్ తెలిపారు
Attachments area