పేదలకు అండగా సీఎం సహాయనిది -తెరాస మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్

మహబూబాబాద్ బ్యూరో-జులై27(జనంసాక్షి)

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ పెద్ద దిక్కుగా ఆపదలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందిస్తూ ప్రతి ఇంటి పెద్ద కొడుకుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారని గార్ల మండల తెరాస పార్టీ అధ్యక్షులు గంగావత్ లక్ష్మణ్ నాయక్ అన్నారు. బుధవారం గార్ల మండలంలోని 8మంది లబ్ధిదారులకు 3,15,500రూపాయల విలువగల చెక్కులను అందించి ఆయా కుటుంబాలకు బరోసానిస్తూ ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో గార్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అజ్మీరా బన్సీలాల్, తెరాస పార్టీ ఉపాద్యాయులు పానుగంటి రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.