హుజూర్ నగర్ మే 16 (జనంసాక్షి): పేద ప్రజలకు అండగా సీఎం సహాయనిధి ఉంటుందని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సహకారంతో హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి సీఎం సహాయ నిధి నుండి విడుదల అయిన 1,76,000 విలువగల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. మంగళవారం హుజూర్ నగర్ పట్టణం మాధవ రాయుని గూడెం (28వ వార్డు), అనుముల గూడెం (12 వ వార్డు ) లకు చెందిన సీఎం సహాయనిధి లబ్ధిదారులకు టి. సరిత – రూ. 60,000 (28వ వార్డు ), ఎం. మనీష – రూ. 60,000 (28వ వార్డు ), ఎస్. సైదమ్మ – రూ. 44,000 (12వ వార్డు ), జి. గోవిందమ్మ – రూ. 12,000 (28వ వార్డు ), లకు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయము నందు చెక్కులను అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి, సీనియర్ నాయకులు అట్లూరి హరిబాబు, మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చనరవి, మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్, కౌన్సిలర్ అమరబోయిన గంగరాజు, యువజన కమిటీ అధ్యక్షులు సోమ గాని ప్రదీప్ గౌడ్, వార్డు అధ్యక్షులు ఆవుల గురవయ్య, బిఆర్ఎస్ పార్టీ నాయకులు నందిగామ ముక్కంటి, యువజన నాయకులు ఆవుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.




