: పేదలకు అన్ని వైద్య సేవలు డిఎంహెచ్ఓ పుట్ట శ్రీనివాస్

అల్వాల్ జనం సాక్షి ఆగస్టు 27
  ప్రభుత్వం అమలు చేస్తున్న  అన్ని వైద్య ఆరోగ్య పథకాలను పేద ప్రజలకు అందజేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ మెడికల్ అధికారులకు సూచించారు.డాక్టర్ పుట్ల శ్రీనివాస్ శనివారం అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఉద్యోగుల హాజరు పట్టికను ఓపీ ఐపీ స్టాక్ఇమ్యునైజేషన్ రిజిస్టర్స్ ను పరీక్షించారు.అలాగేతెలంగాణ డయాగ్నసిస్ మినీహబ్ ను ఈసీజీ ఎక్స్రే యూఎస్జీ రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య ఆయుస్సు శాఖా వైద్య అధికారిని డాక్టర్ శైలజతో కలిసి డిఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ ఆయుష్ ఆరోగ్య కరదీపిక నుఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో అల్వాల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రసన్న లక్ష్మీ, డాక్టర్ అనగ్, వైద్య సిబ్బంది రాధిక, అనురాధ, వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.